భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో శనివారం బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను గ్రామ సర్పంచ్ గునిగంటి కమలాకర్ నేతృత్వంలో వైభవంగా నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు.. సర్పంచ్ పర్యవేక్షణ

బతుకమ్మ వేడుకలకు హాజరైన గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ గునిగంటి కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పండుగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను…