భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో కొనసాగుతోంది. గ్రామంలో మొత్తం 702 మంది ఈ పథకానికి అర్హులుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 100 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు నాయకులు గొండస్వామి తెలిపారు.

గ్రామ సర్పంచ్ సంతోష గొండస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు బీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ నాయకులు గొండస్వామి యాదవ్, శ్రీరామ్…