భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మెదక్ పట్టణంలో పండుగ సందడి నెలకొంది. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి పట్టణంలోని ఓ గాజుల దుకాణాన్ని సందర్శించి గాజులు కొనుగోలు చేశారు. అక్కడికి వచ్చిన మహిళలు, చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారికి గాజులు కొనిపెట్టి, స్వయంగా తొడిగారు.

మహిళలు, చిన్నారులతో ఆత్మీయంగా..

మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఆరేళ్ల గాయత్రి, గడ్డమీద యశోదతో కలిసి ఆమె గాజుల దుకాణానికి వెళ్లారు. మహిళలు, చిన్నారులతో సరదాగా మాట్లాడి వారిలో పండుగ…