భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ముఖ్యంగా ఈ రబీ సీజన్‌లో అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
సోమవారం రామాయంపేటలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు…






