భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి, వివిధ విభాగాల్లో సమర్థవంతంగా సేవలందించిన 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ జాబితాలో వలిగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కూడా ఉండటంతో ఆయన సేవలకు గుర్తింపు లభించింది.
విధుల్లో ప్రతిభకు గుర్తింపు
నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా…






