భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తలారి ఆంజనేయులు (36) మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆవంచ గ్రామానికి చెందిన ఆంజనేయులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ అవసరాలతో పాటు ట్రాక్టర్ నిర్వహణ ఖర్చుల కోసం కొంతకాలంగా అప్పులు చేశాడు.…