భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ మహాగణపతి మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత బుధవారం శ్రీ చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా కుంకుమార్చన, పారాయణం, శ్రీచక్ర అభిషేకం తదితర…