భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహబూబాబాద్ పట్టణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. పండుగలో భాగంగా ఐదో రోజు పట్టణంలోని నాలుగో వార్డు గాంధీపురంతో పాటు 17వ వార్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు.

మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలు

ఈ వేడుకల్లో మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ…