భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార నాణ్యతపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి, వెంటనే విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని సీపీఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆహార భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఏదీ?

నర్సాపూర్ పట్టణంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత,…