భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సంబరాల్లో గౌడ సంఘ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి

ఈ వేడుకలకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…