భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. రెండో పీఆర్సీని ప్రకటించడంతో పాటు కనీస వేతనాన్ని ₹.30వేలుగా నిర్ణయించాలని కోరింది. ఈ మేరకు నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్‌కు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా మున్సిపల్ కార్మికులకు రెండో పీఆర్సీ పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని ప్రకటించాలని కోరారు.…