భారత్ సమాచార్, హైదరాబాద్: విదేశాల్లో సంపాదించిన జ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశ అభివృద్ధికి ఉపయోగించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు తెలుగు యువకుడు గుంటి రాకేష్. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో AI సహా అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానించి, భవిష్యత్ వైద్యులకు మెరుగైన శిక్షణ అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. పారిస్‌లో ఉంటూ రేస్‌హై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాకేష్.. వైద్య రంగంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించడంపై…