భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులకు వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసారం కాపాడుకోవడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ‘ఖేతి బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా వ్యవసాయ భూములను సంరక్షించడం, భూసారాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించడంతో పాటు, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై…






