భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.
సంగారెడ్డిలో నిర్వహించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల సమస్యలను ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నవాబ్‌పేట, రత్నాపూర్, కొంగోడు, ఎం. జలాల్పూర్, రైలాపూర్ తండా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
…






