భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని కాచికల్ నుంచి రామానుజాపురం, ఎర్రబెల్లిగూడెం మీదుగా మేచరాజపల్లికి వెళ్లే రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఎర్రబెల్లిగూడెం సర్పంచి ఉషా అశోక్ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డితో కలిసి మంగళవారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
తొర్రూరు–మానుకోట ప్రధాన రహదారిలోని కాచికల్ స్టేజి నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని సర్పంచి ఉషా అశోక్ తెలిపారు. రహదారి అధ్వానంగా మారడంతో…






