భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం చైతన్య ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని నీటి పొదుపు, కరువును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు సందేశం అందించారు.
విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన నినాదాలు చేస్తూ స్థానిక…






