భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణా కేంద్రం (ఏటీసీ), తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణాలకు సంబంధించిన బ్లూప్రింట్, లేఅవుట్ మ్యాప్‌లను మంగళవారం పరిశీలించారు.

ఇనుగుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ పరిశీలనలో ఎమ్మెల్యే మురళి నాయక్, MP పోరిక…