భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు సురారం రమేష్ కుమార్ (40) బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో మృతి చెందాడు. గత నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతిపై తండ్రి సురారం యాదయ్య ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ కుమార్ మొహమ్మదాబాద్లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సుమారు…






