భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రసాయన ఎరువుల మితిమీరిన వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతినకుండా భూసారాన్ని కాపాడుకోవాలని, ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవడం, నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా సాగులో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘ఖేత్ బచావో అభియాన్’పై రైతులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచి తమ్మడపల్లి…