భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పాండ చెరువు కట్ట వద్ద ఉన్న కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు రాకపోకల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పనులు చేపట్టారు.

మెదక్ MLA మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కౌన్సిలర్…