భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తినిచ్చారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్పందించారు. మొత్తం 108…