భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలతో పాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. రోగులు తమ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చని సూచించారు.
బుధవారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో ఉన్న యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు.…






