భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 7, 2026న కోర్టును ప్రారంభించనున్నట్లు జిల్లా జడ్జి నీలిమ వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కావడంతో కోర్టు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

తూప్రాన్‌లోని పాత MPDO కార్యాలయ భవనంలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు భవనంలో అవసరమైన మరమ్మతులు, ఇతర మెరుగుదల…