భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హాసకొత్తూర్ సర్పంచ్ రేవతి గంగాధర్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుంటూ చదువులో మంచి ఫలితాలు సాధించి, ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
కమ్మరపల్లి మండలంలోని హాసకొత్తూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫామ్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవతి గంగాధర్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్‌తో పాటు టైలు, బెల్టులు, షూస్ అందజేశారు.
ఈ సందర్భంగా…






