భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బస్సుల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నిజాంపేట పోలీసులు రట్టు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా బస్సులో చోరీకి గురైన 30 తులాల బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఛేదించి, ప్రధాన నిందితురాలిగా గుర్తించిన మేకల సంధ్య (30)ను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందానికి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.…