భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పరిధిలోని భూముల హద్దులను పక్కాగా నిర్ధారించి, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా భూభారతి పథకం కింద రీ సర్వే నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. ఈ ప్రక్రియపై రైతులు, గ్రామ ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో భూభారతి పథకం కింద చేపట్టనున్న భూముల రీ సర్వేపై శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సబిత రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో, తహసీల్దార్…






