భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాలతో పాటు వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజ్య తండా సర్పంచ్ ధారావత్ విజయ ఆనంద్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని రాజ్య తండాలో శుక్రవారం సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్లీ సెక్టార్ మీటింగ్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ICDS అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విజయ ఆనంద్, ICDS ACDPO విజయలక్ష్మి, సూపర్వైజర్ ఆర్. నీరజ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో…