భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం జగన్నాధపురం, కేశాపురం గ్రామాల మధ్య వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆదివారం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరికలు నెరవేరాలని మొక్కులు సమర్పించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ…





