భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం హైస్కూల్ ఆవరణలో శనివారం మండలస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు MEO, స్థానిక పాఠశాల హెచ్‌ఎం వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన ఈ పోటీలు జరిగాయి.

మండలంలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలోని ప్రతిభను ప్రదర్శిస్తూ…