భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు, ఉపాధ్యాయ సంఘం సభ్యుడిగా సంఘ బలోపేతానికి భూసాని సోమయ్య అందించిన సేవలు అపూర్వమని PRTU TS ఎమ్మెల్సీ ఎంగిలి శ్రీపాల్ రెడ్డి కొనియాడారు. పదవీ విరమణ పొందిన సోమయ్య సార్ను అభినందిస్తూ, ఆయన సేవలను ప్రశంసించారు.
మండలంలోని నైనాల ప్రాథమికోన్నత పాఠశాలలో భూసాని సోమయ్య పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు స్థానిక సర్పంచి యాసం…






