భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన సమస్యల దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చిన్నశంకరంపేట ఎంపీడీవో దామోదర్ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో ప్రజావాణి ద్వారా మొత్తం 18 దరఖాస్తులు అందగా, వాటిలో 9…






