భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో చిన్నశంకరంపేట PM శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థిని బి. ఆర్తి చంద్ర ప్రథమ బహుమతి సాధించడం పట్ల మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని సాధించిన విజయాన్ని అభినందిస్తూ, ఈ ఘనత వెనుక కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను సోమవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వాణికుమారితో పాటు ఉపాధ్యాయులు నర్సింలు, రవిబాబు, దేవిసింగ్లను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి…






