భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ IPS పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన శంకరంపేట-ఆర్, చేగుంట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా CCTNS, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.…






