భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గంజాయి అక్రమ రవాణా కేసులో గత కొంతకాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కేసముద్రం CI వై. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో నెల్లికుదురు SI గంగారపు కరుణాకర్‌తో కలిసి నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హనుమాన్‌పురకు చెందిన కాపుగేరి రాజు తన సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతం నుంచి సుమారు 2 కిలోల 400 గ్రాముల గంజాయిని కొనుగోలు చేశాడు.…