భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వరి కోతలు జరుగుతున్న సమయంలో హార్వెస్టర్ కింద పడి ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లంబాడి శంకర్ నాయక్ (46) ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కింద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డ తాండాకు చెందిన లంబాడి శంకర్ నాయక్, తండ్రి మాన్సింగ్, గత…