భారత్ సమాచార్, మెదక్ జిల్లా : వెల్దుర్తి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వెల్దుర్తికి చెందిన గ్రామ యువకులు సర్పంచ్, ఈఓ అధికారులకు ఫిర్యాదు అందజేశారు. గ్రామంలో ప్రధానంగా వేధిస్తున్న వీధి కుక్కల బెడదతో పాటు మటన్ ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
గ్రామంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువకులు…






