భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఎలాంటి లైసెన్సులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కొమ్ముల భాస్కర్ డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని విమర్శించారు.
ఈ మేరకు బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ…






