భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ సూచించారు. వ్యవసాయ శాఖ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
శ్రీరామగిరి గ్రామంలో మండల వ్యవసాయ శాఖ AO భూక్య మహేందర్ ఆధ్వర్యంలో బుధవారం కేత్ బచావో అభియాన్, ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ…






