భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కోరారు. తాటివనం, ఈతవనాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హుస్నాబాద్ పట్టణంలోని పొట్లపల్లి రోడ్డు వైపు దామరకుంట సమీపంలో తాటి, ఈత వనాలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో…