భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో శ్రీ వత్సల్ గురుకుల పాఠశాలకు చెందిన స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ ప్రభాకర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 35 మంది విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం ప్రకారం.. డ్రైవర్ ప్రభాకర్ బస్సును నడుపుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు…






