భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ప్రత్యేక చొరవతో నాలుగు ప్రాంతాల్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల రైతులకు స్థానికంగానే పలు వ్యవసాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
శివ్వంపేట మండలంలోని గోమారం, కొల్చారం మండలంలోని యనగండ్ల గ్రామాలతో పాటు నూతనంగా ఏర్పాటైన మాసాయిపేట, చిలిపిచెడ్ మండలాల్లో…






