భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ఈ అంశాలపై నర్సాపూర్ మండలంలోని మూసాపేట్, ఎల్లారెడ్డిగూడ తండా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో ఎల్ నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా…