భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సోమ మల్లేష్ యాదవ్ మృతి బాధాకరమని తహసిల్దార్ చంద నరేష్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మంగళవారం మల్లేష్ యాదవ్ కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విషయం తెలుసుకున్న తహసిల్దార్ చంద నరేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో పాటు పలువురు రేషన్ డీలర్లు ఆలేరు గ్రామానికి చేరుకున్నారు. మల్లేష్ యాదవ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం…






