భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో గ్రామసభల్లో భాగంగా రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, భూగర్భ జలాల పరిస్థితి, యాసంగి పంటల సాగు ప్రణాళికపై రైతులకు వివరించారు.
ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయే…






