భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో బాలల హక్కులపై అవగాహన పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో రామాయంపేట మండలంలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
'బాల హక్కులు – పరిరక్షణ' అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తం చేయడంతో పాటు చిత్రాల ద్వారా బాలల హక్కుల ప్రాధాన్యతను…






