భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మండల ప్రత్యేక అధికారి నీలిమ సూచించారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు, భీంరావుపల్లి గ్రామాల్లో ఎల్నినో ప్రభావం, నీటి సంరక్షణ,…






