భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల మంజూరు పత్రాలను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్‌తో కలిసి సర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా…






