భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గోదావరి నది పుష్కరాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.

బాసర ఆలయ ఈఓ కార్యాలయంలో గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష…