భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్నికల అవగాహన, క్విజ్, వ్యాసరచన పోటీల్లో నెల్లికుదురు పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. వివిధ పోటీల్లో ఉన్నత స్థానాలు సాధించిన విద్యార్థులకు శుక్రవారం కలెక్టరేట్లో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎస్. దీక్షిత్, అమృతవర్షిణి 4వ స్థానాన్ని సాధించారు. అలాగే వ్యాసరచన పోటీల్లో పి. సిరివెన్నెల 6వ స్థానంలో నిలిచి…






