భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ జట్టుకు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అసోసియేషన్ ప్రతినిధులు.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి సరైన సమయంలో ప్రోత్సాహం అందిస్తే వారు రాష్ట్ర,…






